![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -281 లో....శ్రీధర్ ఏదో వెతుకుతుంటాడు అప్పుడే కావేరి వచ్చి.. మీరు కార్తీక్ ఇచ్చిన నోట్ గురించి వెతుకుతున్నారు కదా అని అడుగుతుంది. అవునని అనగానే.. అది మీకెందుకు అన్నట్లు కావేరి పొగరుగా సమాధానం చెప్తుంది. అప్పుడే శ్రీధర్ ఫ్రెండ్ కాల్ చేసి తన మనవడి బర్త్ డే కి రమ్మని చెప్తాడు. సరే అని శ్రీధర్ ఫోన్ కట్ చేసి.. బర్త్ డే కి వెళదామని అంటాడు. నేను రానని కావేరి చెప్పి వెళ్ళిపోతుంది. రాకు నేను ఒక్కడినే వెళ్తానని శ్రీధర్ అనుకుంటాడు.
దీప పేపర్ పై ఏదో లెక్కలు వేస్తుంది. శౌర్య అడిగితే చెప్పదు. కార్తీక్ వచ్చి ఏంటని అడుగుతాడు. మనం చిట్టీలు వేస్తే వచ్చే డబ్బుతో రెస్టారెంట్ పెట్టగలం.. అలాగే అప్పు తీర్చగలం.. అలా రోజుకి మనం ఇంత సంపాదించాలని లెక్కలు చెప్తుంది. కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ.. చాలా బాగా చెప్పావని అంటాడు. అప్పుడే ఒకతను వచ్చి బర్త్ డే ఉందని చెప్పి, పార్టీకి కేటరింగ్ ఇవ్వాలని అంటాడు. సరే మేం చేస్తామని కార్తీక్ అడ్వాన్స్ తీసుకుంటాడు. ఎందుకు అలా మాటిచ్చారు.. మనకి వీలు అవ్వదు.. టిఫిన్ సెంటర్ , శౌర్య ఉందని దీప అంటుంది. మేం కూడా హెల్ప్ చేస్తామని అనసూయ, కాంచన అంటారు. దీప సరే అంటుంది. అందరు వంటలు పూర్తిచేసి అన్ని కూడా ఆటోలోకి ఎక్కిస్తారు. దీప, కార్తీక్ లు ఆటో వెనకాల ఎక్కి వెళ్తుంటారు. కార్తీక్ పడిపోతుంటే దీప పట్టుకుంటుంది . కార్తీక్ ఎలా ఉండేవాడు.. ఎలా అయ్యాడంటూ కాంచన బాధపడుతుంది.
బర్త్ డే కి శ్రీధర్ వెళ్లి తన ఫ్రెండ్ తో మాట్లాడతాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అతను అడుగగా.. వాడికి అసలు విషయం తెలియదు కదా అని మా వాడు చాల బిజీ అంటూ శ్రీధర్ గొప్పలు చెప్తుంటాడు. అదే బర్త్ డే అని కార్తీక్, దీప లు కేటరింగ్ కి వస్తారు. శ్రీధర్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే.. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం వస్తారు. మీ కొడుకు మేనకోడలిని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకున్నాడన్నావ్.. ఇప్పుడు మీ అబ్బాయి ఎవరిని చేసుకున్నాడని అతను అనగానే.. శ్రీధర్ కి దగ్గు వస్తుంది. దాంతో వాటర్ తీసుకొని రా బాబు అని అతను పిలవగానే కార్తీక్ వాటర్ తీసుకొని వచ్చి.. శ్రీధర్ కి ఇస్తాడు. కార్తీక్ ని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. బావ ఇక్కడికి కేటరింగ్ కి వచ్చాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |